7
స్తెపాను సన్‌హద్రిం సఙమ్‌దు మ‍న్ని వ‍రివెట వ‍ర్గిజినాన్
అయావలె విజేరె పుజేరిఙ ముస్కు పెరి పుజేరి స్తెపానుఙ్‌ వెన్‌బాతాన్, “యా మాటెఙ్‌ ‌నిజమా? వీరు వెహ్తి లెకెండ్‌ నీను వెహ్తిదా సిల్లెదా?”. దన్నిఙ్‌ స్తెపాను వెహ్తిక ఇనిక ఇహిఙ, “తంబెరిఙాండె, బుబ్బరాండె, వెండ్రు, మా అనిగొగొ ఆతి అబ్రాహాం ఆరోను ఇని పట్నమ్‌దు బత్కిఎండ ముందాల, మెసొపొతెమియ ఇని దేసమ్‌దు బత్కిజి మహాన్‌. అయావలె నండొ జాయ్‌ మన్ని దేవుణు వన్నిఙ్ ‌తోరె ఆతాన్. దేవుణు అబ్రాహాం వెట ఈహు వెహ్తాన్‌, ‘నీను నీ దేసెం డిఃసి, నీ సొంత లోకాఙ్‌ ‌డిఃసి నాను నిఙి తోరిసిని దేసెం సొన్‌అ'.
అయావలె వాండ్రు కల్దియుఙ్‌ బత్కితి మహి మెసొపొతెమియ దేసెం డిఃసి ఆరోను పట్నమ్‌దు సొన్సి బత్కితాన్. వన్ని బుబ్బ సాతి వెనుక అబెణిఙ్ ‌మీరు ఏలు బత్కిజిని యా దేసమ్‌దు బత్కిదెఙ్‌ ‌దేవుణు వన్నిఙ్ ‌కూక్త తతాన్. అయావలె దేవుణు వన్నిఙ్ ‌ఉండ్రి ముక బూమిబా అక్కు సిఏతాన్, యా దేసమ్‌దు. గాని అయావలె అబ్రాహాముఙ్‌ కొడొఃర్‌ సిల్లితిఙ్‌బా దేవుణు వన్ని వెట ఉండ్రి మాట సిత్తాన్‌. అక్క ఇనిక ఇహిఙ, ‘నిఙి, నీ పొటెఙాణి వరిఙ్ విజెరిఙ్‌ ‌యా బూమి ఆనాద్’. దేవుణు వన్ని వెట, ‘నీ పొటెఙాణికార్ ‌ఆఇ దేసమ్‌దు సొనారె బానె ఆఇకార్‌ లెకెండ్ ‌మనార్. అయ దేసెమ్‌దికార్ ‌నీ లోకాఙ్‌ నాల్గి వందెఙ్ ‌పంటెఙ్ ‌వెట్టిపణి కిజిని వరిలెకెండ్ ‌పణి కిబిసి వరిఙ్‌ లొఙిజి మంజిని వజ ఇడ్ఃజి మాలెఙ్ ‌కినార్’. గాని వారు ఎమేణి దేసమ్‌దు పణి కిజినారొ అయ దేసెమ్‌ది వరిఙ్ ‌నాను తీర్‌పు తీరిసి సిస‍ సీనాలె. వెనుక వారు ఆ దేసెం డిఃసి వాజి యా బాడ్డిదు మంజి నఙి పొగ్‌డిఃజి మాడిఃస్నార్లె ఇజి వెహ్త మహాన్‌. దేవుణు అబ్రాహాం వెట ‘విజెరి కుటుమ్‌కాఙ్‌ పుట్తి మొగ్గ కొడొఃరిఙ్‌ సున‍తి కిదెఙ్‌ వలె’, ఇజి వెహ్తాన్‌. అందెఙె అబ్రాహాం, వన్ని మరిసి ఇస్సాకు పుట్తి ఏడు రోస్కు వెనుక మహ్స నాండిఙ్, ఇహిఙ, ఎనిమిది రోస్కాఙ్‌ సునతి కిత్తాన్‌. ఇస్సాకు, వన్ని మరిసి యాకోబుఙ్‌ ‌సునతి కిత్తాన్‌. యాకోబు వన్ని పన్నెండు మంది మరిసిరిఙ్‌ సునతి కిత్తాన్‌. యా పనెండు మందినె ఇస్రాయేలుది పనెండు కుటుమ్‌ది అనిగొగొర్‌ ఆతార్.
9-10 యా పన్నెండు మంది అనిగొగొర్‌ వరి లొఇ తంబెరి ‌ఆతి యోసేపు ముస్కు గోస ఆతారె వన్నిఙ్‌ గొత్తి పణి కిదెఙ్‌ పొర్తార్. ఆహె యోసేపు అయ్‌గుప్తు దేసమ్‌దు గొత్తి పణి కిత్తాన్‌. గాని దేవుణు వన్ని వెట మహండ్రె వన్నిఙ్ వాతి విజు మాలెఙాణిఙ్ తప్రిస్తాన్. దేవుణు వన్నిఙ్‌ గెణం సిత్తిఙ్ అయ్‌గుప్తు రాజు ఆతి పరొ యోసేపు ముస్కు దయ తోరిస్తాన్. పరొ రాజు యోసేపుఙ్‌ ‌అయ్‌గుప్తు దేసెమ్‌దిఙ్ నడిఃపిసిని వన్నిలెకెండ్‌ నిల్‌ప్తాన్. పరొ రాజుఙ్‌ కల్గితి మహి విజు వనకాఙ్‌ ముస్కు నడిఃపిసిని వన్నిలెకెండ్‌ కిత్తాన్‌.
11 అయావలె అయ్‌గుప్తు దేసమ్‌దు విజు, మా అనిగొగొర్‌ బత్కిజి మహి కనాను దేసమ్‌దు విజు పెరి కరు వాతాద్. కరు వాతిఙ్‌ నండొ మాలెఙ్ ‌వాతె. మా అనిగొగొర్‌ ఆతి వరిఙ్‌ తిండి దొహ్క్‌ఏండ ఆతాద్. 12 అయావలె, అయ్‌గుప్తు దేసమ్‌దు తిండి మనాద్‌ ఇజి యాకోబు వెహాన్‌. వెహాండ్రె వన్ని మరిసిరిఙ్, ఇహిఙ, మా అనిగొగొరిఙ్‌ ‌ముందాల్నె ఉండ్రి సుటు బాన్‌ పోక్తాన్. 13 వారు మరి ఉండ్రి సుటు సొహిఙ్, యోసేపు, వన్ని దాదారిఙ్ వాండ్రు ఎయెన్‌ ఇజి నెల్వ కిబె ఆతాన్. అయావలె యోసేపు కుటుమ్‌ది వరి వందిఙ్‌ పరొ రాజు నెస్తాన్. 14 వెనుక యోసేపు వన్ని బుబ్బ ఆతి యాకోబుఙ్‌ వన్ని సొంత లోకాఙ్‌ విజేరిఙ్‌ అయ్‌గుప్తు దేసమ్‌దు రదు ఇజి కబ్రు పోక్తాన్. వారు మొత్తం డబయ్‌ అయ్‌దుగురు మహార్‌. 15 అయావలె యాకోబు, వన్నివెట మహికార్‌ విజేరె అయ్‌గుప్తు దేసెం సొహార్. వారు అబ్బె బత్కిత్తార్. వెనుక యాకోబు, మహి అనిగొగొరు బానె సాతార్. 16 వెనుక వరి డుముక్‌ సెకెం ఇని పట్నమ్‌దు మర్‌జి తత్తారె, ముందాల అబ్రాహాం హామోరు మరిసిర్‌‌ బాణిఙ్‌ ‌కొటి దూకి లొఇ ముస్తార్‌*.
17 దేవుణు అబ్రాహముఙ్‌ ముందాల్నె సిత్తి మాట వజ జర్గిదెఙ్‌ డగ్రు ఆజి వాతాద్. అయావలె మా లోకు అయ్‌గుప్తు దేసమ్‌దు నండొ లోకు ఆజి వాతార్. 18 అయావలె, యోసేపు ఎయెన్‌ ఇజి నెస్‌ఇ ఒరెన్ ‌రాజు అయ్‌గుప్తు దేసెమ్‌దిఙ్ ఏలుబడిః కిదెఙ్ ‌మొదొల్‌స్తాన్. 19 యా రాజు మా లోకాఙ్‌ ‌మాయ మాటెఙ్‌ వెహ్సి మొసెం కిత్తాన్‌. గొప్ప మాలెఙ్ కిత్తాన్‌. మొగ్గకొడొఃర్‌ పుట్తిఙ వరిఙ్‌ సప్తెఙ్‌ వెటనె గడ్డదు విసీర్దెఙ్‌ వలె ఇజి యా రాజు ఆడ్ర సిత్తాన్‌. ఎందనిఙ్‌ ఇహిఙ వారు సాజి సొండ్రెఙ్.
20 ఆ కాలమ్‌దు మోసె ఇనికాన్‌ ఒరెన్ ‌పుట్తాన్. వాండ్రు సుడ్ఃదెఙ్‌ గొప్ప నెగ్గికాన్. వాండ్రు మూండ్రి నెలెఙ్‌ దాక వన్ని బుబ్బ ఇండ్రొ పిరితాన్. 21 మూండ్రి నెలెఙ్‌ వెనుక వన్నిఙ్‌ ఇండ్రొ వెల్లి సోప్సి గడ్డ ఒడ్డుదు ఇట్తార్. అయావలె పరో రాజు గాల్సి వాతాదె కొడొఃదిఙ్‌ లాగితాదె దన్ని మరిసి లెకెండ్ పోస కిబిస్తాద్. 22 మోసెఙ్‌ అయ్‌గుప్తు వరి విజు తెలివి నెస్‌పిస్తాన్. వాండ్రు, వ‍ర్గిని మాటెఙ‍ లొఇ బాగ వ‍ర్గిదెఙ్ అట్నాన్. కిని పణిఙ లొఇ నెగ్రెండ కిదెఙ్ అట్నాన్.
23 మోసెఙ్‌ నలపయ్ ‌పంటెఙ్ ‌ఆతివలె నా సొంత లోకుర్ ‌ఆతి ఇస్రాయేలుర్‌ బానె సొన ఇజి బుద్ది పుట్తాద్. 24 వాండ్రు సొహిఙ్‌ అయ్‌గుప్తుదికాన్‌ ఒరెన్, ఒరెన్‌ ఇస్రాయేలు వన్నిఙ్ మాలెఙ్ కిజి మహిఙ్‌ ‌సుడ్ఃతాన్. సుడ్ఃతండ్రె, ఇస్రాయేలు వన్నిఙ్ గెల్పిస్తెఙ్ ఇజి అయ్‌గుప్తు వన్నిఙ్ ‌సప్తాన్. ఆహె నాయం తీరిస్తాన్. 25 ఇస్రాయేలు లోకాఙ్‌ వరి బాదెఙాణిఙ్ డిఃబిస్తెఙ్ ‌దేవుణు నఙి పోక్తాన్‌ ‌ఇజి మోసె ఒడిఃబితాన్. గాని వారు అర్దం కిఏతార్. 26 మహ్స నాండిఙ్‌ మోసె ‌ఇస్రాయేలు లోకాఙ్‌ సుడ్ఃజి సొహాన్‌. ‌రిఎర్ ఇస్రాయేలు లోకుర్‌ ‌టంటెఙ్ ఆజి మహిఙ్‌ ‌మోసె వరిఙ్‌ సుడ్ఃతండ్రె, ‘ఒరె ఒరె బాబు, మీరు తంబెరి రిఇదెర్‌గదె? మీరు ఎందనిఙ్‌ ఒరెన్‌ వన్ని ముస్కు ఒరెన్ ‌టంటెఙ్‌ ఆజినిదెర్’ ‌ఇజి వెహ్తండ్రె వారు రిఎరిఙ్‌ కూడుఃప్తెఙ్‌ ఇజి సుడ్ఃతాన్. 27-28 గాని ఆఇ వన్ని ముస్కు అనయం కినికాన్‌ వెహ్తాన్‌, ‘మా ముస్కు అతికారి వజ మండ్రెఙ్, తీర్‌పు తీర్‌స్ని వన్నివజ మండ్రెఙ్‌ నిఙి ఎయెన్‌ ఏర్‌పాటు కిత్తాన్‌? నీను ఇఎన్ ‌అయా అయ్‌గుప్తు వన్నిఙ్‌ సప్తిలెకెండ్ ‌నఙిబా సప్తెఙ్‌ ఇజి సుడ్ఃజినిదా ఇజి వెహ్తండ్రె మోసెఙ్‌ నెక్తపొక్తాన్. 29 యాక వెహాండ్రె మోసె తియెల్‌ ‌ఆతాన్. వెటనె అయ్‌గుప్తు దేసెం డిఃసి సొహాన్‌. మిద్యాను ఇని దేసమ్‌దు సొహాండ్రె ఆఇకాన్‌ లెకెండ్ ‌బత్కిత్తాన్. బానె పెండ్లి ఆతండ్రె రిఎర్‌ కొడొఃరిఙ్‌ ఇట్తాన్. 30 నలపయ్ పంటెఙ్‌ వెనుక, సినాయి ఇని పెరి గొరొన్‌ డగ్రు మన్ని బిడిఃమ్‌ బూమిదు మహిఙ్, ఒరెన్ ‌దేవుణు దూత మోసెఙ్‌ తోరె ఆతాన్. యా దూత వెయ్‌జి మహి తుప్పెఙ నడిఃమి ఉండ్రి సిసు కొణ లొఇ తోరె ఆతాన్. 31 మోసె అక్క సుడ్ఃతిఙ్‌ ‌బమ్మ ఆతాన్. బమ్మ ఆతండ్రె నెగ్రెండ సుడ్ఃదెఙ్‌ తుప్ప డగ్రు సొహాన్‌. డగ్రు సొహిఙ్‌ దేవుణు మాట ఈహు వెహాన్‌, 32 ‘నాను నీ అనిగొగొర్‌ ఆతి అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు ఇని వరి దేవుణు'. యాక వెహాండ్రె మోసె తియెల్‌ ఆజి వణక్తాన్. సుడ్ఃదెఙ్‌బా అట్‌ఏతాన్.
33 దేవుణు మరి వెహ్తాన్‌, ‘నీ జోడ్కు కుత్సి ఇడ్ఃఅ. నీను నిహిమన్ని బాడ్డి దేవుణుదిఙ్‌ ‌కేట ఆతి బాడ్డి'. 34 అయ్‌గుప్తు దేసమ్‌దు మన్ని నా లోకాఙ్‌ మాలెఙ్ ‌నాను నెగ్రెండ సుడ్ఃత. వారు అడఃబానిక వెహ. అందెఙె నాను వరిఙ్‌ డిఃబిస్తెఙ్ ‌డిఃగిత వాత. ఏలు రఅ నిఙి నాను అయ్‌గుప్తు దేసెం పోక్న ఇజి వన్నివెట వెహ్తాన్‌.
35 ‘మా ముస్కు అతికారి వజ మండ్రెఙ్‌ తగ్గు తెప్నికాన్‌ వజ మండ్రెఙ్ ‌నిఙి ఎయెర్‌ ఏర్‌పాటు కిత్తాన్’ ఇజి వెహ్సి ఇస్రాయేలు లోకుర్, ముందాల నెక్సి పొక్తి యా మోసెఙ్‌నె, దేవుణు అతికారి వజ, తప్రిసినికాన్‌ వజ వరిబాన్‌ పోక్తాన్. వెయ్‌జి మహి తుప్ప లొఇ తోరె ఆతి దేవుణు దూత సాయమ్‌దాన్‌ మోసెఙ్ ‌దేవుణునె పోక్తాన్. 36 అయ్‌గుప్తు దేసమ్‌దు బమ్మ పణిఙ్ ‌కిజి మోసె ఇస్రాయేలురిఙ్‌ తప్రిస్త తతాన్. ఎర్రఙ్‌ సమ్‌దరంబానె, మరి వారు నలపయ్ పంటెఙ్ నడిఃజి సొహిమహి బిడిఃమ్‌ బూమిదుబా మోసె బమ్మాని పణిఙ్ బమ్మాని ‌గుర్తుఙ్ ‌కిత్తాన్‌. 37 యా మోసెనె ఇస్రాయేలురు వెట, ‘దేవుణు నఙి పోక్తి లెకెండ్‌ మీబాణిఙె ఒరెన్‌ ప్రవక్తెఙ్‌ మీబాన్‌ పోక్నాన్’, ఇహాన్‌. 38 బిడిఃమ్‌ బూమిదు సఙం కూడిఃతి మహి ఇస్రాయేలు లోకుర్‌ వెట మహికాన్‌ ‌యా మోసెనె. మా అనిగొగొర్‌ వెట మహికాన్‌ వీండ్రె. సీనాయి గొరొతు దేవుణు దూత విన్నివెటనె వర్గితాన్. మఙి సీదెఙ్‌ ‌దేవుణు బాణిఙ్ ‌ఎల్లకాలం బత్కిని మాటెఙ్‌ తత్తికాన్ ‌వీండ్రె.
39 గాని యా మోసెఙ్‌ మా అనిగొగొర్‌ లొఙిజి మన్‌ఏండ నెక్తపొక్తార్. మర్‌జి అయ్‌గుప్తు దేసమ్‌దు సొహిఙ నెగ్గెద్‌ ఇజి వారు కోరితార్. 40 అయ్‌గుప్తు దేసెమ్‌దాన్‌ మఙి కూక్తి తత్తి యా మోసె ఇనిక అతాండ్రొ మఙి తెలిఏద్. అందెఙె మర్‌జి అయ్‌గుప్తు దేసమ్‌దు సొండ్రెఙ్‌ మఙి ముందాల నడిఃదెఙ్‌ దెయమ్‌కు తయార్ ‌కిజి సిదా ఇజి మోసె అన్నసి ఆతి ఆరోను వెట వెహ్తార్‌. 41 అయావలె వారు ఉండ్రి దూడః లెకెండ్‌ బొమ్మ తయార్‌ కిత్తరె పూజ కిత్తార్‌. వరి కిక్కాణిఙ్‌ ‌తయార్‌ కిత్తి దన్నిముస్కు వారు నండొ సర్ద ఆతార్. 42 గాని దేవుణు కోపం ఆతండ్రె మొకొం వెనుక మహ్తాన్. ఆగాసమ్‌దు మన్నికెఙ్ ‌సుడ్ఃదెఙ్, నెల పొద్దు సుక్కెఙ్ విజు దన్నిఙ్ ‌పూజ కిదెఙ్‌ వరిఙ్ ‌డిఃస్త సిత్తాన్‌. ప్రవక్తరు ముందాల్నె రాస్తిమహిక దిని వందిఙె. అక్క ఇనిక ఇహిఙ “ఇస్రాయేలు లోకాండె, మీరు బిడిఃమ్‌ బూమిదు ‌నల్‌పయ్ ‌పంటెఙ్ ‌నడిఃసి సొన్సి మహివలె పూజ కిత్తిక నఙినె ఆఏద్‌. 43 మీరు పూజ కినాట్‌ ఇజి తయార్ ‌కిత్తి మొలూకు రొంపయు ఇని సుక్కెఙాణి దెయమ్‌కాఙె గూడాఃరమ్‌దు పిండిజి ఒసి మహిదెర్. వనకాఙె పూజ కిత్తిదెర్. అందెఙె బబులోను దేసెం అతాల్‌ మిఙి తొహ్సి ఒతెఙ్‌ నాను సరి సీనాలె. 44 మా అనిగొగొర్‌ బిడిఃమ్‌ బూమిదు సొన్సి మహివలె సాసి గూడారం వరివెట మహాద్‌. దేవుణు మోసెఙ్‌ తోరిస్తి లెకెండె మోసె యా సాసి గూడారం తయార్ ‌కిత్తాన్‌. 45 మరి లావు పంటెఙ్‌ వెనుక యెహొసువ ఇనికాన్‌ అయ టయమ్‌దు యా సాసి గుడారం పిండిత ఒతండ్రె మా అనిగొగొరిఙ్‌ ‌నడిఃపిస్తాన్. అయావలె ఇస్రాయేలు లోకాఙ్‌ సీనా ఇజి దేవుణు వెహ్తి దేసమ్‌దు వారు సొహార్. దేవుణు వరివెట మహిఙ్‌ బానె మహి యూదురు ఆఇ లోకుర్‌ వెట ఉద్దం కితారె, గెల్‌స్తారె ఆ దేసెం సొంతం కిత్తార్‌. బానెబా మా అనిగొగొర్‌ యా సాసి గూడారం పిండిత ఒతార్. దావీదురాజు వరిఙ్ ఏలుబడిః కిత్తి కాలమ్‌దాక యా సాసి గూడారం బానె మహాద్‌. 46 దావీదురాజు ఇహిఙ దేవుణు వెహ్తి వజ నడిఃతికాన్. దేవుణు దయ వన్ని ముస్కు లావు మహాద్‌. అహిఙ్‌బా మా అనిగొగొ ఆతి యాకోబు పార్దనం కిత్తి యా దేవుణుదిఙ్‌ ఎలాకాలం మండ్రెఙ్‌ ఉండ్రి గుడిః తొహ్తెఙ్‌ ‌దావీదు రాజు వెన్‌బాతిఙ్‌బా దేవుణు సరి సిఏతాన్. 47 గాని దావీదురాజు మరిసి ఆతి సొలోమొనుఙ్‌నె దేవుణు గుడిః తొహ్తెఙ్‌ సరి సిత్తాన్‌. 48 అహిఙ్‌బా విజెరిఙ్‌ ఇంక గొప్ప పెరి దేవుణు, లోకు కిక్కాణిఙ్‌ ‌తయార్ ‌కిత్తి బాడ్డిదు మన్‌ఏన్.
49 దేవుణు మాటెఙ్‌ ప్రవక్త ఈహు వెహ్సినాన్‌: “పరలోకం నాను బసిని సిమసనం. బూమి నా పాదమ్‌కు ఇడ్ని పీట. నాను మండ్రెఙ్ ‌ఉండ్రి గుడిః తొహ్తెఙ్‌ ‌మీరు అట్‌ఇదెర్. 50 ఎందనిఙ్‌ ఇహిఙ, పరలోకం, బూమి, దన్ని లొఇ మన్నికెఙ్ విజు నానె పుటిస్త”. 51 మూర్కం బుద్ది మన్నికిదెరా, దేవుణు మాటెఙ్‌ ఒప్పుకొటాప్ ‌ఇజి మీరు సునతి కిత్తిదెర్‌ గాని దేవుణు మాటెఙ్‌ గిబ్బిఙాణి వెంజిబా సరినె వెన్‌ఇ లెకెండ్ ‌మంజినిదెర్. వెహిఙ్‌బా సరినె మన్సుదు ఇడ్ఃఏండ లొఙిఇదెర్. మీ అనిగొగొర్‌ లెకెండ్‌ మీరుబా ఎసెఙ్‌బా సరినె దేవుణు ఆత్మదిఙ్‌ ‌నెక్సిపొక్సినిదెర్. 52 మీ అనిగొగొర్‌ ప్రవక్తరిఙ్‌ విజెరిఙ్‌ ‌గొప్ప మాలెఙ్ కిత్తార్‌. దేవుణు పోక్న ఇజి వెహ్తి ఆ నీతి వాండ్రు వందిఙ్‌ ముందాల్నె వెహ్తి ప్రవక్తరిఙ్‌బా మీ అనిగొగొర్‌ సప్తార్. ఏలు ఆ నీతి వన్నిఙ్ ‌మీరు ఒపజెప్తిదెర్. వన్నిఙ్‌ సప్తిదెర్. 53 దేవుణు వన్ని దూతవెట మిఙి సిత్తి రూలుఙ్‌ మిఙి దొహ్‌క్తె గాని మీరు దన్నిఙ్‌ లొఙిఇతిదెర్”.
స్తెపానుఙ్‌ పణుకుఙాణిఙ్‌ డెఃయ్‌జినార్
54 యా మాటెఙ్‌ ‌వెహరె వారు గొప్ప కోపం ఆతారె స్తెపానుఙ్‌ ‌సుడ్ఃజి పల్కు కొహ్‌క్తార్. 55 గాని స్తెపాను దేవుణు ఆత్మ సత్తు పూర్తి నిండ్రిజి ఆగాసం దరోట్‌ సుడ్ఃతాన్. సుడ్ఃతిఙ్‌ దేవుణు గొప్ప జాయ్‌ సుడ్ఃతాన్. యేసుప్రబు దేవుణు ఉణెర్‌ పడఃక నిహి మహిక సుడ్ఃతాన్. 56 “సుడ్ఃఅ, ఆగాసం రే ఆతి మహిక, లోకు మరిసి ఆతి యేసు దేవుణు ఉణెర్‌ పడఃక నిహిమహిక నాను సుడ్ఃజిన”, ఇజి స్తెపాను వెహ్తాన్‌.
57 గాని యా మాటెఙ్‌ వెహరె వెటనె వారు గిబ్బిఙ్ ‌మూకె ఆతారె డటం గగోలాజి విజేరె ఉండ్రె ఆజి వన్ని ముస్కు వాతార్. 58 పట్నమ్‌దాన్‌ వెల్లి లాగిత ఒతారె వన్నిఙ్‌ పణుకుఙాణ్‌ డెఃయ్‌జి సప్తెఙ్‌ మొదొల్‌స్తార్. పణుకుఙ్ ‌విసీర్‌ని సాసి లోకుర్‌ వరి సొక్కెఙ్‌ ముందాల సవులు ఇని ఒరెన్‌ దఙడాఃయెన్‌ పాదమ్‌కాఙ్‌ డగ్రు తత్తారె ఇట్తార్.
59 వారు స్తెపానుఙ్‌ పణుకుఙాణిఙ్ ‌డెఃయ్‌జి మహిఙ్‌ ‌స్తెపాను, “యేసుప్రబువా నా పాణమ్‌దిఙ్ ఏలు నీ డగ్రు కూడుఃప్‌అ”, ఇజి పార్దనం కిత్తాన్‌. 60 వెనుక స్తెపాను ముణుకుఙ్‌ ‌ఊర్‌జి, “ప్రబువా, వీరు కిజిని యా పాపం విరి ముస్కు మోప్మ”, ఇజి డటం డేల్‌స్తాన్. యా మాట వెహ్తండ్రె వాండ్రు పాణం డిఃస్తాన్. స్తెపానుఙ్‌ సప్తిక సవులు ఒప్పుకొటాన్.
* 7:16 7:16 అయ ‍కాలమ్‌దు అయ్‌గుప్తు దేసెమ్‌దికార్ పీనుగుదిఙ్ నూనె రాసి పా‍త లొఇ ఇడ్నార్, సబ్‌ఏండ మండ్రెఙ్ 7:44 7:44 సాసి గుడారం. దేవుణు ఇబ్బె మనాన్‌ ఇజి లోకాఙ్‌ వెహ్సి మహి గుడారం 7:49 7:49 సిమసనం. తీర్‌పు కిదెఙ్ రాజుర్‌ బసిని కుర్సి