యోహాను వ్రాసిన మొదటి పత్రిక
యోహాన్ లిఖ్యొతె మొదుల్ను పుస్తక్
మొదుల్ను వాతె
1 యోహాన్‍నూ పుస్తక్ క్రీ. ష. 50-100 వరహ్ఃను ఇచ్మాను ధన్మా అపొస్తలుడ్ హుయోతె యోహాన్ లిఖ్యొ. యోహాన్ యోస్ రచయితకరి గుర్తించొ కొయిని, పన్కి అగాడిను అధ్యాయంమా ఇను యేసునూ జీవితంనా అజు జివీన్‍ఉట్టనా ప్రత్యాక్చా సాబూత్‍కరి దెఖ్కాడొ1:1-3 1 యోహాన్‍మనూ రచనాసైలినా యోహాన్ సువార్తమా ఛాతె రచనాసైలినాబీ కందేను పోలిన్ ర్హాస్. యోహాన్ సువార్తనా లిఖ్యొ అజు ఎఫెసీమా జింకరతెదె 1 యోహాన్, 2 యోహాన్, బుజూ 3 యోహాన్‍కరి తీన్ పుస్తకాల్నా లిఖ్కీన్ హుసేకరి నమ్మజాయ్.
దేవ్‍కొయినికరి గ్నోస్టిక్స్ కరి బులావతె అద్మియే గళ్లోమతూ సంఘంనా ఇబ్బందిహుంకరతె వహఃత్‍మా యోహాన్ క్రైస్తవుల్నా ఆ పుస్తక్ లిఖ్యొ. ఆ అద్మియే యేసు పూర్తితీ దేవ్ కరి నమ్యు. పన్కి ఇను హాఃఛితి జమీన్‍ఫర్ ర్హాయ్యోతెదె భోటి అజు ల్హొయితి హుయోతె ఆంగ్ కాహె. ఆ కారణంతీ, యేసు జీవన్‍నా హుఃద్ సాబుత్‍నితరా ర్హావనూ అజు ఇను హాత్ యేసునా ఛీమంతరా యోహాన్ లిఖ్యొ 1:1-5 ఆ లేఖ లిఖ్కనా యోహాన్‍నూ ఉద్దేష్యం షాత్కతొ, ఇను ఖుషినా పూర్తికరను 1:4, విష్వాస్‍వాల పాప్ నాకర్నూతిమ్ దేఖను 2:1, తప్పును బోధమతూ విష్వాసుల్నా బచ్ఛావను 2:26, ఇవ్నె బచ్ఛిగయూకరిస్ కచ్ఛితంగా కల్గావను 5:13
విషయంనా బోలను
1. యోహాన్ ఇను లేఖనా పరిచయం కర్లీన్ అజు ఆ లిఖ్కనటేకె ఏక్ ఉద్దేష్యంనా దిదొ. 1:1-4
2. ఇను దేవ్ కిమ్ ఉజాళుమా థోకి, యేసు జీవ్యొ తిమ్మస్ అప్నేబి జీవ్నుకరి వివరించిబోల్యొ 1:5–3:10
3. పాసల్తి ఇను ఏక్నుయేక్ ఫ్యార్‍కర్నుకరి ఆజ్ఞనా గుర్తు కరాంకరస్. 3:11–5:12
4. ఇను ఇను ఉత్తరంనా బంద్‍కర్యొ 5:13-21
1
1 జమానమతూ హల్లూతి మాలంకర్యతె, హమారుహాత్ కినా ఛీమిన్ దేఖ్యకి, హమె షాత్ హఃమ్జకి, ఢోలాతి షాత్ దేఖ్యకి యో తుమ్న మాలం కరాంకరియేస్.
2 యోజీవమ్ దెఖ్కాయు భా కంతూ హమ్నా దెఖ్కాయుతే యో నిత్యజీవంను బారెమా హాఃఛి బోల్తొహుయీన్, ఇనా హమే తునా మాలం కరాంకరియేస్.
3 హమారేతి తుమ్నా సహవాసమ్ కల్గుతిమ్ హమె దేఖ్యతె ఇనా హఃమ్జతె ఇనా తుమ్నా బొలాంకరియేస్. అప్ను భా తి ఇనొ ఛియ్యో హుయోతె యేసుక్రీస్తునాకేడె ఛా.
4 అప్ను ఖుషి పరిపూర్ణం హువనటేకె హమే ఆ సంగతినా లిఖ్కుకరియేస్.
దేవ్ను ఉజాళు
5 హమే ఇనా బారేమా హఃమ్జీన్ తుమ్నా ప్రచార్ కరుకరతే వర్తమాన్ షాత్‍కతొ దేవ్ ఉజాళు హుయీన్ ఛా ఇనకనా అంధారు ధరాషుబి కొయిని.
6 ఇనకేడె సహవాసమ్ హుయతెవాలకరి బొల్లీన్ అంధారమా చాల్తొ ర్హయోతో తెదె అప్నె చ్హాడ్ బోల్తాహుయీన్ హాఃఛినా చలావకొయిని తిమ్ ఛియ్యే.
7 పన్కి ఇను ఉజాళుమా ఛాతిమ్ అప్నే ఉజాళుమా చాల్యతొ తెదె. అప్నె అన్యోన్యా సహవాసం తీ వాలా హుయీన్ ర్హాసు. తెదె ఇను ఛియ్యో హుయోతె యేసు ల్హొయి హర్యేక్ పాప్‍మతూ అప్నా పవిత్ర గోని కర్సె.
8 అప్నె పాప్ కొయింతెవాలాకరీ బొలి లీదాతో, అప్ను అప్నెస్ మోసం కర్లిదా వాల హుసూ బుజు అప్నమా హాఃఛి కోర్హాయిని.
9 అప్ను పాప్నా అప్నెస్ ఒప్పి లిదాతో, యో నమ్మకం వాలో నీతిమంతుడ్ అనటేకే యో అప్న పాప్నా మాప్ కరీన్ సమస్త దుర్నీతి మతూ అప్నా పవిత్రుల్ ఘోని కర్సే.
10 అప్నే పాప్ కర్యా కొయినీ కరి ఒప్పి లిదాతొ, ఇనా జూటివాలొకరి కరవాలంతరా హుసూ బుజూ ఇను వాక్యం అప్నమా కోర్హాసెని.