3
అనటేకె హంకేతు ఏథెన్సు నంగర్మా హఃమాల్చూకొయిని యెత్రేమాబి హమే ఎకేళాతోబి ర్హావను అష్యల్‍కరి సోచీన్‍. ఆ మిన్హత్‍నా బారెమా కోన్బి కదలకోయినితిమ్‍ తుమ్నా స్థిరమ్‍ హువానటెకే తుమార విష్వాస్‍ను వాత్‍మా తుమ్నా జాగ్రుత్‍ కర్యాయిన్‍ అప్నో భైయ్యే క్రీస్తు సువార్తనా విషయాంమ దేవ్ను పరిచారకుడ్‍ అప్నేతి కామ్‍ కర్యోహుయోతె తిమోతినా బోలిమోక్‍ల్యా. హామె తుమారకనా థా, తెదె అప్నే మిన్హత్‍నా అనుభవింపునుకరి తుమారేతి మొదులస్‍ బోల్యథా కొయిన్నా? ఇమ్మస్‍ హుయూ. ఎజాత్ను మిన్హత్‍మా అనుభవించనా అప్నే నియమింపబడ్యావాలకరి తుమె మాలంకర్చూ. ఆ తుమ్నాబి మాలంహుసె; ఇనహాఃజె మేబి హంకెతూ నాష్‍హువ కొయినితిమ్‍, హఃతావవాలొ తుమ్నా ఏక్తార సోదించాస్‍సూకీ హమారు కోసిష్‍ పాల్తుహుయుసూకీ కరిబీ తుమారు విష్వాస్‍నా మాలంకర్నూకరి తిమోతినా బోలిమొక్ల్యొ థొ.
హంకె తిమోతి తుమారకంతూ హమారకనా ఆయిన్‍, హాఃమే తుమ్నా కిమ్‍ దేక్నుకరి ఆహ్‍ఃఛాకి, ఇమ్మస్‍ తుమేబి హామ్నా దేక్నుకరి ఆహ్ః కర్తహుయిన్‍ హమేసా హమ్నా ఫ్యార్‍తి హఃయల్‍ కర్లేంకరస్‍కరి, తుమారు విష్వాస్‍నాలిన్‍ తుమారు ఫ్యార్‍నా లీన్‍, ఖుషినా సమాచార్‍ హామ్న ల్యాయో. అనహాఃజె, భై, భేనే హమారు ఇబ్బందుల్‍ హాఃరమా మిన్హత్‍మా తుమారి విష్వాస్‍నా దేఖిన్‍, తుమారి విషయంమా ఆదరణ పొందుకరియేస్‍. కిమ్కతో తుమే ప్రభువుమా స్థిరంతి ఉబ్బిర్యాన హమేబి జీవాంతరాస్‍. అప్నో దేవ్నా హాఃమే తుమ్నాలీన్‍ హాఃమెపోందుకరతే జాహఃత్‍ ఖుషినాలీన్‍ దేవ్న పూరిజాను తిమ్‍ కృతజ్ఞాత స్తుతుల్‍ కిమ్‍ కర్సూ? 10 హమే తుమార మ్హోఢన దేఖిన్‍, తుమారు విష్వాస్‍మా ఛాతె ఖర్రాబ్‍నా కాడ్నుకరి అనుగ్రహించ్‍కరి రాత్‍ ధన్‍ ఉబ్రకొయినితిమ్‍ పురాదిల్తీ దేవ్న మాంగుకరియేస్‍.
11 అప్నొ “భా” హుయోతె దేవ్నాబి అప్నొ ప్రభుహుయోతె యేసునా అప్నే ఆటంకంకొయినితిమ్‍ తుమారకనా లీన్‍ ఆవనూ హువదా. 12 తుమేబి ఏక్ను యేక్‍ అద్మిహాఃరేతి ఫ్యార్‍తి అభివృద్ధి పొంధీన్‍ వర్థిల్నుతిమ్‍, ప్రభువు దయాకరును గాక. 13 ఇమ్మస్‍ బుజు అప్నో ప్రభువుహుయోతె యేసు ఇను పరిసుద్ధుల్‍ హాఃరంతి ఆయోతెదె, అప్నొ “భా” హుయోతె దేవ్న హాఃమె తుమారు దిల్నూ పరిసుద్ధాత విషయాంమా నిందాకొయినీతరా ఇను తుమ్నా స్థిరపర్చబడ్సు.