15
క్రీస్తుమా పునర్థానమ్
1 బుజు భైయ్యే, మే తుమ్నా ప్రచార్‍కర్యొతె సువార్తన బుజు తుమ్నా మాలంకరాంకురూస్.
2 తుమె ఇనా ఒప్పిలిదా, ఇనఫరస్ ఉబ్రిన్ ఛా. తుమారు విష్వాస్ పాల్తుహుయితోస్ పన్కి, మే కెహూ ఉపదేషంనురూపంతి సువార్తనా తుమ్న ప్రచార్‍కర్యొకి యోఉపదేషంనా తుమె గట్ ధరీన్‍రాక్యతెదె యోసువార్తన బారెమాస్ తుమె బచ్చవాలహుయీన్ ర్హాసు.
3 మన దెవ్వాయిరూతె ఉపదేషంనా అగాఢి తుమ్నస్ దీరాక్యొస్, యో కెహుకతొ లేఖనంనూ ప్రకారం క్రీస్తు అప్ను పాప్‍నా నిమిత్తంతీ మరిగయో.
4 లేఖనంను ప్రకారంతి సమాధిహుయీన్ తీన్మను ధన్నె యో జీవీన్ ఉట్టాడ్యొ.
5 యో కేఫానబి పాస్సల్తి బ్హారజననా అపోస్తల్‍నా దెఖ్కాయో.
6 ఇనపాసల్తి ఫాచ్‍హొఃతి జాహఃత్ భైయ్యేనా ఏక్ వహఃత్మాస్ దెఖ్కాయో, అవ్నమా థోడుజణు జీవిన్ ఛా. అజు థోడుజను లిందర్ లెంకరస్.
7 పాసల్తి ఇనె యాకోబ్‍నాబి బుజు ఇన పాసల్తి అపొస్తలును హాఃరజణవ్నా దెఖ్కాయో.
8 హాఃరనా ఆఖిరీమా యోకాలంమా ఫైయిదాహుయోతె మనాబి దేఖ్కాయో.
9 కింకతొ మే అపొస్తలుహాఃరవ్‍మా కంనొవాలొబి దేవ్ను సంఘంనా హింసించ్యొన కరి అపోస్తల్‍హువనటేకె బొలావనా యోగ్యబికొయిని.
10 హుయితోబి మే సాత్ హుయిరోస్కి యో దేవ్ను కృపనుబారెమాస్‍హుయిన్ ఛవ్. బుజు మన దేవ్వాయ్‍రూతె ఇను కృప చుక్కేస్ కోజాసెని. పన్కి ఇవ్నా హాఃరెహూః మే జాహఃత్ మిన్హత్ కర్యొ.
11 మే సాత్‍హుయోతోబి ఇవ్నె సాత్‍హుయోతోబి, ఇమ్మస్ హమే ప్రచార్‍కరూకరియేస్. ఇమ్మస్ తుమేబి విష్వాస్‍సించా.
అప్న పునర్థానమ్
12 క్రీస్తు మరణ్‍మతూ ఉట్టాడి రాక్యోస్‍కరి ప్రచార్‍కరూకరతెదె తుమారమా థోడుజను మరిహుయూనా పునరుత్థానం కొయినికరి కిమ్ బోలుకరాస్?
13 మర్యుహుయూన పునరుత్థానం నార్హైయుతొ తెదె, క్రీస్తుబి జివీన్ ఉట్టీన్ ర్హయోహోత్‍కొయిని?
14 బుజు క్రీస్తు నాఉట్యొహోత్తొ హమే కరుకరతె ప్రచార్ ఫాల్తుస్, తుమారు విష్వాస్‍బి ఫాల్తుస్.
15 దేవ్ క్రీస్తునా ఉట్టాడ్యొకరి ఇనలీన్ హమె సాబుత్‍నా బోలిరాక్యస్ కొయిన్నా? మరణ్‍మా నాఉట్యొహుయోతొతెదె దేవ్ యేసునాబి కోవుట్టాడ్యొహోత్‍ని అనహాఃజె హమేబి దేవ్‍ను విషయంమా జూటి సాబుత్‍నితరా బోలిరాక్యస్ కాహెనా?
16 మరిగయాహు నాఉట్యోహోతొ క్రీస్తుబి జీవిన్ ఉట్యొకోయిని.
17 క్రీస్తు నాఉట్టీన్ ర్హయోతొ తుమారు విష్వాస్ ఫాల్తుస్, తుమే అజుబీ పాప్‍మాస్ ఛా.
18 ఎత్రెస్‍కాహె క్రీస్తుమా మరిగుతె ఇవ్నెబి నాష్ హుయుగయు.
19 ఆ జాన్ ర్హావయెత్రెధన్ తోడిస్ అప్నె క్రీస్తుమా ఆహ్ః రాఖవాలహుయాతొ అద్మిహాఃరంతీబి అప్నకన దౌర్భాగ్యుల్‍హుయీన్ కోర్హాసెని.
20 హంకెహుయ్‍తొ క్రీస్తు పాచుఫరిన్ వుట్టమా, మర్జైన్ ఉట్యుతె ఇవ్నమా ఫ్హైలు ఫలంహుయో.
21 ఏక్ అద్మినబారెమాస్ మరణ్ ఆవస్ ఇనటేకె అద్మినబారెమాస్ మరిహుయూన పునరుత్థానం హుసె.
22 ఆదామ్‍ను బారెమా హాఃరుజణు కిమ్ మరణ్ పొందుకరాస్కి, ఇమ్మాస్ క్రీస్తునుబారెమా హాఃరుజణు జీవ్సె.
23 హారేక్‍జణు ఇను యినూ వరుసమా జివాడ్సే, అగాఢికతొ ఫ్హైలు ఫల్ క్రీస్తు; ఇన పాసల్తి క్రీస్తు ఆయోతెదె ఇనఖందె ర్హవ్వాలు జివ్వాడజాసె.
24 ఇన పాస్సల్‍తి ఇనె సమస్తమ్‍హుయుతే అధిపత్యంనా, సమస్తంను అధికారంనబి తాఖత్ పోఢినాఖిదీన్ ఇనొ భా హుయోతె దేవ్ను రాజ్యమ్‍నా దినాఖిదిసే; తెదె అంతమ్ ఆవ్సె.
25 సానకతో ఇను దుష్మన్ హాఃరవ్‍నా ఇను గోఢను హేట్ ర్హావతోడి ఇను రాజ్యపరిపలనా కరావ్‍తొర్హాసె.
26 ఆఖరిమా నాషనంహువాలొ దుష్మన్‍ను మరణ్.
27 దేవ్ సమస్తంనా క్రీస్తు గోడనాహేట్ బిచ్చాయ్‍రాక్యొస్, సమస్తంబి వాతేనా గోడాన హేట్ బేంద్యొతె దేవ్ తప్ప మిగిల్యుతె ఇనా గోడానహేత్ ఛా! హుసే కొయిన్నా?
28 బుజు సమస్తం ఇన హాత్మా ఆయుత్రుతెదె దేవ్ సర్వాధికారితరా ర్హావన నిమిత్తంతీ ఇనొ ఛియ్యో సమస్తంనా ఇను హేట్ మెరాక్యుతె దేవ్‍నా యో కందే హుసే.
29 అమ్ నాహుయితొ మరీగుతె ఇవ్నటేకె బాప్తిస్మమ్ లెవ్వాలు సాత్ కర్సె? మరిగుతే అద్మి నాజీవిన్ ఉట్యుతెదె ఇవ్నటేకె బాప్తీస్మమ్ లెవ్వాను సానా?
30 బుజు హమే ఘంటో ఘంటొనా జాన్నుఢర్తి జీవ్‍ను సాన?
31 భైయ్యే, అప్నొ ప్రభూహుయోతె యేసుక్రీస్తుమా తుమ్నలీన్ మన ఛాతె బడ్డాయినుబన్తి మే హార్‍రోజ్ మర్జంకరూస్ కరి బోలిస్.
32 అద్మియోనుతరా, మే ఎఫెసుమా జిన్వార్‍తి లాడైయికర్యొథొ మన లాభమ్ సాత్? మరీహుయునా నావుట్టనహుయుతొ “కాల్ మరిజాసూ అనటేకె ఖయ్యే పియ్యే”
33 మోసమ్ నొకొహువొ దుష్టుల్‍నా హాఃమే అష్యల్ ఛాల్‍నా కర్రాబ్ కరాఖిదేస్.
34 నీతిను చాల్‍వాల్తి జాగిర్హయిన్ పాప్ నొకొకరో దేవ్నలీన్ జ్ఞాన్ థోడజనా కోయిని. తుమ్నా షరంహువనాటేకె ఆ వాత్ బోలుకరూస్.
జీవిన్ ఉట్టను
35 హుయుతొ మర్యుగుతె కిమ్ జీవ్సె? ఇవ్నె కెహూ ఆంగ్తాన్‍తి ఆవ్సెకరి ఏక్జను పుచ్చాయో.
36 ఓ బుద్దికొయింతే అద్మి, తూ బింజోల గాడ్యొతెదె యో మరిగుతోస్ కాహెనా పాచు జీవ్సెతె.
37 తూ గాడ్యొతె ఘౌను బింజొళన బుజు కెహూబి బింజోలుహో ఖాలిబింజోలనా గాఢుకరస్ పన్కి పుట్సెతె ఆంగ్తాన్‍నా కాహె.
38 పన్కి దేవ్‍నె ఇను ఇష్టంతీస్ తూ గాడ్యొతె బింజోళనా రూపంనా దెంకరాస్ బుజు హర్యేక్ బింజొలాన ఇను యినూ ఆంగ్తాన్‍నా దెంకరాస్. భోటి ఆ హఃరుబీ యేక్ ర్హావనుహుయుతె కాహె.
39 అద్మియోను భోటి అలాదు, జాన్వార్ను బోటి అలాదు, జిన్వార్‍ను బోటి అలాదు, మాస్లును బోటి అలాదు.
40 ఇమ్మస్ ఆకాష్‍మా రాఛునురూప్ ఛా, ధర్తిఫర్ రాఛునురూప్ ఛా, ఆకాష్‍ను రాఛును మహిమ అలాదు, ధర్తనురూప్ రాఛను మహిమ అలాదు.
41 సూర్యుడ్‍ను మహిమ అలాదు, చంద్రమాను మహిమా అలాదు, థారోను మహిమా అలాదు, మహిమానలీన్ యో ఏక్ థారోన బుజేక్ థారోన ఉజాలుమా తేడా ర్హాసె కొయిన్నా?
42 మరిగుతె ఇవ్నె ఫరిన్ జీవనుబి ఇమ్మస్ ఆంగ్తాన్ హంకేను నాష్‍కొయింతె ఆంగ్తాన్ పొంద్సు.
43 ఘనహినంని పిఖాయిన్ మహిమనితార ఉట్టాడ్సె, కంజోర్‍నితరా ఫికాయుతొ, తాఖత్‍తి ఉట్టాడ్సె.
44 స్వభావికం సంబంధంహుయుతే ఆంగ్తాన్‍తరా నక్కాయిన్, ఆత్మసంబంధంహుయుతె ఆంగ్తాన్‍తార ఉట్టాడ్సె. ప్రకృతి సంబంధంహుయుతె ఆంగ్తాన్ ఛా ఇనటేకె, ఆత్మ సంబంధంహుయుతె ఆంగ్తాన్‍బి ఛా.
45 అనహాఃజె ఆదామ్ ఫైహ్లు జియ్యోతె అద్మికరి లిఖ్కైరూస్, ఆఖరీను ఆదామ్ జీవిన్ ఆత్మ హుయ్రోస్.
46 ఆత్మ సంబంధంహుయుతె అగాఢి ఆయుహుయుకాహే, స్వభావికం సంబంధంహుయుతేస్ అగాఢి ఆయు. ఇనపాసలతి ఆత్మసంబంధమ్ హుయుతే.
47 మొదుల్ను అద్మి ధర్తినుసంబంధంహుయితె మాటిమతూ ఫైదాహుయోతె, బెంమ్మను అద్మి స్వర్గంమతూ ఆయొహుయోతె.
48 అగాఢి మాట్టిమతూ ఫైదాహుయుతె కెజాతునుకీ ఇన పాస్సల్‍తీ మాట్టిమతు ఫైదాహుయుతే ఇవ్నె హాఃరుబి ఇంజొక్నూస్, స్వర్గంనుసంబంధి కెజాత్నోకి స్వర్గంనూ సంబంధుల్బి ఎజాత్నుస్.
49 బుజు అప్నే మాటిమతు ఫైదాహుయుతె రూప్‍మా పేరాక్యతె తిమ్మస్ స్వర్గంనుసంబంధిహుయూతె రూప్‍నా పేర్సు.
50 భైయ్యే బ్హేనె, మే బోలుకరూతె సాత్కతొ ల్హొయి బోట్టి దేవ్‍ను రాజ్యంమా జాసెకొయిని, క్చయ అక్చయనా స్వతంత్రించె కొయిని.
51 హదేక్ తుమ్నా ఏక్ మర్మమ్ మాలంకరుకురూస్, అప్నెహాఃరు కోఖూసుని పన్కి నిమిషంమా ఢోళనుపాప్నే మారతోడి, ఆఖిరి బూరా వాజమస్ అప్నెహాఃరను రూప్ బదల్సె.
52 బూర వాజ్సె; తెదె మరిహుయూ పవిత్రుల్గా ఉటాడ్సె, అప్నె రూప్ బద్లిజాసె.
53 నాషనంహుయుతె ఆ ఆంగ్తాన్ నాష్‍హువకొయింతె పేర్లావనుహుయీన్ చా; మరిజాసెతే ఆ ఆంగ్తాన్‍నా మరణ్‍కొయింతె ఆంగ్తాన్నా పేర్లావనుహుయిన్ ఛా.
54 అమ్నితార నాష్‍హువను నాష్‍హువకొయింతె ఇనా, మరిజాసేతే మర్సెకొయింతే ఇనా పేరిలిదాతెదా, “జీత్ను మరణ్నా గలిల్దు” కరి లిఖ్కాయ్‍రూతె వాత్ నెరవేర్యు .
55 ఓ మరణ్, తారు జీత్ కెజ్గా?
ఓ మరణ్ తారు కాఠొ క్యా?
56 మరణ్‍ను కాఠొ పాప్; పాప్నఛాతె తాఖత్ ధర్మషాస్ర్తం.
57 హుయితోబి అప్నొ ప్రభుహుయోతె యేసుక్రీస్తు బారెమా అప్న జీత్ దేవ్వాంకరతె దేవ్న సోత్రం కల్గను హువదా.
58 హుయుతోబి మార లాఢ్‍నా భైయ్యె భేనె, తుమారు ప్రయాసం ప్రభూమ్హడ్తి ఫాల్తుకాహెకరి మాలంకరీన్, ఎక్ జోడ్మా, కద్లకొయింతెవాలనితరా, ప్రభూను కార్యాభివృద్ధికనా కెదేబి ఆషక్తివాలహుయిన్ ర్హవొ.