2
నేను మైదానంలో కుంకుమ పువ్వును* లోయలలో కస్తూరి పుష్పాన్ని.
అతడు అంటున్నాడు
నా ప్రియురాలా, ఇతర స్త్రీల మధ్య నీవు ముళ్ల మధ్య
కస్తూరి పుష్పంలా ఉన్నావు!
ఆమె అంటుంది
నా ప్రియుడా, ఇతర పురుషుల మధ్య
నీవు అడవి చెట్ల మధ్య ఆపిలు చెట్టులా ఉన్నావు!
ఆమె స్త్రీలతో అంటుంది
ఆనంద భరితనై నేనతని నీడన కూర్చుంటాను!
నా ప్రియుని నీడలో కూర్చుని నేను ఆనందిస్తాను, అతని పండు నాకెంతో తియ్యగా వుంది.
నా ప్రియుడు నన్ను మద్యగృహానికి తీసుకుని వెళ్లాడు,
నా మీద అతని ఉద్దేశం ప్రేమ.
ఎండు ద్రాక్షాలతో నాకు బలాన్నివ్వండి,
ఆపిలు పండ్లతో నా అలసట తీర్చండి, ఎందుకంటే నేను ప్రేమతో బలహీనమయ్యాను.
నా ప్రియుని ఎడమ చేయి నా తల కింద ఉంది,
అతని కుడి చేయి నన్ను పట్టుకొంది,
 
యెరూషలేము స్త్రీలారా, నాకు వాగ్దానం చెయ్యండి, దుప్పులమీదా అడవి లేళ్ల మీదా ఒట్టేసి, నేను సిద్ధపడేవరకూ.§
ప్రేమను లేపవద్దు,
ప్రేమను పురికొల్పవద్దు.
ఆమె మళ్లీ అంటుంది
నా ప్రియుని గొంతు వింటున్నాను.
అదిగో అతడు వస్తున్నాడు.
పర్వతాల మీది నుంచి దూకుతూ
కొండల మీది నుంచి వస్తున్నాడు.
నా ప్రియుడు దుప్పిలా ఉన్నాడు
లేదా లేడి పిల్లలా ఉన్నాడు.
మన గోడ వెనుక నిలబడివున్న అతన్ని చూడు,
కిటికీలోనుంచి తేరి పార చూస్తూ,
అల్లిక కిటికీలోనుంచి* చూస్తూ
10 నా ప్రియుడు నాతో అంటున్నాడు,
“లే, నా బంగారు కొండా,
నా సుందరాంగీ, మనం పోదాంపద!
11 చూడు, శీతాకాలం వెళ్లిపోయింది,
వానలు వచ్చాయి వెళ్లాయి.
12 పొలాల్లో పూలు వికసిస్తున్నాయి
ఇది పాడే సమయం!
కోలాహలపు పావురాలు తిరిగి వచ్చాయి.
13 అరటి చెట్లమీద చిన్న పండ్లు ఎదుగుతున్నాయి.
పూలు పూస్తున్న ద్రాక్షా తీగల వాసన చూడు.
లే, నా బంగారు కొండా, నా సుందరాంగీ,
మనం పోదాం పద!”
అతడు అంటున్నాడు
14 ఇక్కడ ఈ పర్వతం మీద
కనపడని ఎత్తైన శిఖరంమీద గుహల్లో దాక్కొన్న నా పావురమా!
నిన్ను చూడనిమ్ము,
నీ గొంతు విననిమ్ము,
నీ గొంతు ఎంతో మధురం,
నువ్వెంతో సుందరం!
ఆమె స్త్రీలతో అంటుంది
15 మాకోసం గుంటనక్కల్ని పట్టుకో
ద్రాక్షాతోటల్ని పాడుసే చిన్న గుంటనక్కల్ని!
మా ద్రాక్షాతోట ఇప్పుడు పూతమీద ఉంది.
16 నా ప్రియుడు నావాడు,
నేను అతని దానను!
అతడు పద్మాల నడుమ గొర్రెలను మేపుతున్నాడు!
17 రోజు తన చివరి శ్వాసను విడిచినప్పుడు నీడలు పరుగెత్తినప్పుడు,
నా ప్రియుడా,
చీలిన పర్వతాల మీద దుప్పిలా, లేడిపిల్లలా తిరుగు!
* 2:1 నేను … కుంకుమ పువ్వును “షార్‌ను గులాబి”నవనవలాడుతూ పచ్చగా”. 2:5 ఎండు ద్రాక్షాలు లేదా “ఎండు ద్రాక్ష రొట్టెలు.” 2:5 ప్రేమతో బలహీనమయ్యాను లేదా “నేను ప్రేమ రోగిని.” § 2:7 నేను సిద్ధపడేవరకూ శబ్దార్థ ప్రకారం “అది కోరేవరకు.” * 2:9 అల్లిక కిటికీలోనుంచి లేదా “కిటికీమీద ఉండే కొయ్యతెర.” 2:12 పాడే సమయం లేదా “చక్కదిద్దే.” 2:17 చీలిన పర్వతాలు లేదా “బెథెర్ పర్వతాలు” లేదా “సుగంధ ద్రవ్యాల పర్వతాలు.”