23
దావీ దు కీర్తన. 
 
1 యెహోవా నా కాపరి  
నాకు కొరత ఉండదు   
2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.  
ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.   
3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.  
ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.   
4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా  
నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు  
నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.   
5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాక భోజనం సిద్ధం చేశావు.  
నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.  
నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.   
6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.  
మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.