4
పరలోకమ్‌దుమన్ని సింహాసనం.
యా సఙతిఙ్‌ జర్గితి వెనుక నాను సుడ్ఃతిఙ్‌ ఇదిలో పరలోకమ్‌దు ఉండ్రి సేహ్ల రే ఆతి మహిక సుడ్ఃత. జోడుఃబాంక పలక్తినన్ని జాటులెకెండ్, నావెట ముఙాల వర్గితి మన్ని కంటం మన్నికాన్, “ఇబ్బె ఎక్సి రఅ. దిన్ని వెనుక ఇనికెఙ్‌ జర్గినెలె ఇజి నాను నిఙి తోరిస్నాలె”, ఇజి వెహ్తాన్‌. వెటనె నాను దేవుణు ఆత్మ వెట నిండ్రిత. నస్తివలె పరలోకమ్‌దు ఉండ్రి సింహాసనమ్‌దు ఒరెన్‌ బస్తిమన్నిలెకెండ్, నా ఎద్రు తోరె ఆతాద్. అయ సింహాసనమ్‌దు బస్తి మన్నికాన్‌ పొద్దులెకెండ్‌ గొప్ప జాయ్‌ మన్ని ఎరాని రంగు పణుకుదిఙ్‌ పోలిసి తోరితాన్. సింహాసనమ్‌దిఙ్‌ సుటులం గొప్ప జాయ్‌ మన్ని ఆకు రంగుది కొడెఃవేలి మహాద్‌. అయ సింహాసనమ్‌దిఙ్‌ సుట్టులం ఇరువయ్‌ నాల్గి సింహాసనమ్‌కు మహె. అయ ఇరువయ్‌ నాల్గి సింహాసనమ్‌కాఙ్, తెల్లాని సొక్కెఙ్‌ తొడిఃగిజి, రాజురి టొపిఙ్‌ నన్ని బఙారం టోపిఙ్‌ బురాదు తొడిఃగిజి ఇరువయ్‌ నాల్‌ఎర్‌ పెద్దెలుఙు బస్త మహార్‌. అయ సింహాసనమ్‌దాన్‌ గొప్ప మెర్సిని జాయ్, దీడ్ఃజినికెఙ్, పిడుఃగుఙ్‌ వెల్లి వాజి మహె. అయ సింహాసనం ఎద్రు ఏడు దీవెఙ్‌ జాయ్‌ సీజి మహె. అక్కెఙ్‌ దేవుణు ఏడు ఆత్మెఙ్. అయ సింహాసనం ఎద్రు గటి మన్ని గాజుదిఙ్‌ పోలితి సమ్‌దరమ్‌లెకెండ్‌ మహాద్‌. అక్క ఇని రంగు సిల్లి గటి మన్ని అద్దం లెకెండ్‌ మహాద్‌. నడిఃమిని, అయ సింహాసనమ్‌దిఙ్‌ సుటులం, ఒడొఃల్‌ ముస్కు, వెనుక ముందాల విజు, కణుకెఙాణిఙ్‌ నిండ్రితి మన్ని పాణం మన్ని నాల్గి జంతుఙ్‌ మహె.
పాణం మన్ని, మొదొహి జంతు మొకొం సింహం లెకెండ్‌ మహాద్‌. రుండి జంతు మొకొం దూడఃలెకెండ్‌ మహాద్‌. మూండ్రి జంతు లోకు మొకొం నన్ని మొకొం మహికాద్. నాల్గి జంతు ఎగ్రిని డేగలెకెండ్‌ మహాద్‌. యా నాల్గి జంతుఙ, ఉండ్రి ఉండ్రి దన్నిఙ్‌ ఆరెసిఙ్‌ రెక్కెఙ్‌ మహె. అయ రెకెఙ ముస్కుని అడిఃగి విజు నిండ్రు కణుకెఙ్‌ మహె. అయ నాల్గి జంతుఙ్.
“ముఙాల మహికాన్, ఏలు మన్నికాన్, వాని కాలమ్‌దు మంజినికానాతి విజు వనకాఙ్‌ అతికారం మన్ని దేవుణు పరిసుద్దమతికా‍న్, పరిసుద్దమాతికాన్, *పరిసుద్దమతికాన్”, ఇజి రెయు పొగల్‌ డిఃస్‌ఏండ పార్జి మహె.
ఎస్తివలెబా అయ పాణం మన్ని నాల్గి జంతుఙ్, అయ సింహాసనమ్‌దు బస్తి మన్ని ఎలాకాలం బత్కిజినికాన్‌ ఆతి వన్నిఙ్, పొగిడిఃజి గవ్‌రం సీజి వందనమ్‌కు వెహ్సి పొగిడిఃజి మహారొ, 10 నస్తివలె అయ ఇరువయ్‌ నాల్‌ఎర్‌ పెద్దెలుఙు అయ సింహాసనమ్‌దు బస్తి మన్నివన్నిఙ్‌ ఎద్రు పడగ్‌జి అర్తారె, ఎలాకాలం బత్కిజిని వన్నిఙ్‌ మాడిఃసి యా లెకెండ్‌ పొగిడిఃజి వెహ్సి మహార్‌.
11 “మా ప్రబు ఆతి దేవుణు, విజు వనకాఙ్‌ తయార్‌ కిత్తికి నీనె. నీను ఇస్టమాతి వజ అక్కెఙ్‌ విజు తయార్‌ ఆతె. అయాలెకెండ్‌నె అక్కెఙ్‌ మన్నె. అందెఙె నీ గొప్ప గవ్‌రం వందిఙ్, నీ గొప్ప సత్తు వందిఙ్‌ లోకుర్‌ విజేరె నిఙి గవ్‌రం సీజి పొగిడిఃజి మంజినార్”, ఇజి వెహ్సి బఙారమ్‌దాన్‌ తయార్‌ కిత్తి రాజురి టోపిలెకెండ్‌ మన్ని వరి టోపిఙ్, సింహాసనం ఎద్రు ఇడ్నార్.
* 4:8 ఇని కల్తి సిల్లెండ గొప్ప నెగ్గికాన్