16
1 “మిఙి ఇమ్సెఙ్ కినివలె, మీరు నమకం దాన్డిఃస్ఏండ మంజిని వందిఙె, మిఙి దూసిస్నికార్ కిని సఙతిఙ వందిఙ్ నాను వెహ్త.
2 వారు మిఙి యూదురి మీటిఙ్ఇల్కాణిఙ్వెల్లి కినార్. మిఙి సప్నికాన్ఎయెన్బా, వాండ్రు దేవుణుదిఙ్ సర్ద కిజిన ఇజి ఒడిఃబిని కాలం వాజినె.
3 వారు నన్నికెఙ్ కినార్. ఎందనిఙ్ఇహిఙ, బుబ్బెఙ్నొ నఙినొ నెస్ఏర్.
4 అయ కాలం వానివలె, నాను దినివందిఙ్ వెహ్త మన ఇజి మీరు ఎత్తుకిని వందిఙ్ నాను యాక మీ వెట వెహ్త మన. నాను యాకెఙ్ ముఙాలె మిఙి వెహ్తెఙ్సిలె. ఎందానిఙ్ఇహిఙ, నాను మీవెట మహ”.
దేవుణు ఆత్మ కిని పణిఙ్
5 “ఏలు నాను నఙి పోక్తి వన్ని డగ్రు సొన్సిన. గాని మీ లొఇ ఎయెన్బా, ‘నీను ఎంబె సొన్సిని?’, ఇజి నఙి వెన్బాఇదెర్”.
6 నాను యా సఙతిఙ్ మిఙి వెహ్తి మనిఙ్, మీ మన్సుసు దుకమ్దాన్ నిండ్రిత మనాద్.
7 గాని నాను నిజం మీ వెట వెహ్సిన, మిఙి మేలు వాని వందిఙె నాను సొన్సిన. నాను సొన్ఏండ మహిఙ, తోడుః మంజినికాన్ మీ డగ్రు రెఏన్. గాని నాను సొహిఙ, నాను వన్నిఙ్ మీ డగ్రు పోక్న.
8 వాండ్రు వాజి, దేవుణుదిఙ్ నమ్మిఇవరిఙ్ పాపం ఇహిఙ ఇన్నిక ఇజి, నాను నీతి నిజాయితి మన్నికాన్ ఇజి, దేవుణు సీని ఎలాకాలం మన్ని సిక్స ఇన్నిక ఇజి కసితం వెహ్సి తోరిస్నాన్.
9 వారు పాపం కిత్తమనార్ ఇజి వాండ్రు కసితం వెహ్సి తోరిస్నాన్. ఎందానిఙ్ఇహిఙ, వారు నఙి నమ్మిఏర్.
10 నాను నీతి నిజాయితి మన్నికాన్ఇజి వాండ్రు కసితం వెహ్సి తోరిస్నాన్. ఎందనిఙ్ఇహిఙ, నాను నా బుబ్బ డగ్రు సొన్సిన. మీరు నఙి మరి తొఇదెర్.
11 దేవుణు సీని ఎలాకాలం మన్ని సిక్స ఇన్నిక ఇజి వరిఙ్ కసితం వెహ్సి తోరిస్నాన్. ఎందానిఙ్ ఇహిఙ, దేవుణుదిఙ్ నమిఇ వరి ముస్కు అతికారం కిని సయ్తానుఙ్, దేవుణు ఎలాకాలం మన్ని సిక్స సిత్తమనాన్.
12 ‘నఙి మరి నండొ మిఙి వెహ్తెఙ్మనాద్, గాని ఏలు మీరు నసొ అర్దం కిదెఙ్ అట్ఇదెర్.
13 గాని దేవుణు వందిఙ్ నిజమాతికెఙ్ నెస్పిస్ని దేవుణు ఆత్మ వానివలె, వాండ్రు దేవుణు బాణిఙ్ వాజిని విజు నిజమాతికెఙ్ మీరు నెస్తెఙ్ మిఙి నడిఃపిసినాన్. వాండ్రు వన్ని సొంతదిక ఇనికబా వెహ్ఎన్. గాని బుబ్బ వెహ్సినికెఙ్వెంజి మిఙి వెహ్నన్. వాండ్రు జర్గిని వన్కాఙ్ వందిఙ్ మిఙి వెహ్నన్.
14 నాను వెహ్సిని నిజమాతికెఙ్ వెంజి, అయాక మిఙి వెహ్నన్. అయ లెకెండ్ నాను గొప్ప పెరికాన్ ఇజి మిఙి తోరిస్నాన్.
15 బుబ్బెఙ్ మన్నికెఙ్ విజు నాదినె. అందెఙె నాను వెహ్త, నాను వెహ్సిని నిజమాతికెఙ్ వాండ్రు వెంజి, అయాక మిఙి వెహ్నన్ ఇజి.
16 సెగం రోస్కు వెన్కా, నాను సొన. మీరు నఙి మరి తొఇదెర్. మరి సెగం రోస్కు వెన్కా, మీరు నఙి సూణిదెర్”.
17 వన్ని సిసూర్ లొఇ సెగొండార్ ఒరెన్ వెట ఒరెన్ ఈహు వెహ్తాన్, “సెగం కాలం వెన్కా మీరు నఙి తొఇదెర్. మరి సెగం కాలం వెన్కా మీరు నఙి సూణిదెర్. నాను నా బుబ్బ డగ్రు సొన్సిన. అందెఙె మీరు నఙి తొఇదెర్”, ఇజి వాండ్రు వెహ్సిని తర్దం అర్దం ఇనిక? ఇజి.
18 “ ‘సెగం కాలం’ ఇజి వాండ్రు వెహ్సిని దని అర్దం ఇన్నిక? వాండ్రు వెహ్సిని దనిఙ్ మఙి అర్దం రెఏండ ఆజినాద్”, ఇజి మరి వర్గిజినె మహార్.
19 దినివందిఙ్వారు వన్నిఙ్ వెన్బాదెఙ్ కోరిజినార్ ఇజి యేసు నెస్తాండ్రె, ఈహు వరిఙ్ వెహ్సినాన్, “'సెగం కాలం వెన్కా మీరు నఙి తొఇదెర్. మరి సెగం కాలం వెన్కా మీరు నఙి సూణిదెర్’, ఇజి నాను వెహ్తి దని అర్దం ఇన్నిక ఇజినా మీరు ఒరెన్దిఙ్ ఒరెన్ వెన్బాజినిదెర్?
20 మీరు దుకం కిజి అడఃబానిదెర్ గాని దేవుణుదిఙ్ దూసిస్నికార్ సర్ద ఆనార్. మీరు దుకం కినిదెర్ గాని మీ దుకం వెనుక సర్దమనాద్ ఇజి నాను మీ వెట నిజం వెహ్సిన.
21 ఉండ్రి బోదెలి ఏరుఈబదెఙ్ నొపిదిఙ్ అడఃబానాద్. ఎందానిఙ్ఇహిఙ, దనిఙ్నెగెండ్ ఆదెఙ్కాలం ఆతాద్. గాని దన్నికొడొః పుట్తిఙ, లోకమ్దు ఒరెన్పుట్తాన్ ఇజి సర్దదాన్ అయా బాదెఙ్ అది ఎత్తు కిఏద్.
22 అయాలెకెండె మిఙి బా. మీరు ఏలు దుకం ఆనిదెర్. గాని నాను మర్జి వానివలె మిఙి మరి సూణ. అయావలె మీరు సర్దఆనిదెర్. అయా సర్ద ఎయెన్బా మీ బాణిఙ్లాగ్దెఙ్అట్ఎన్.
23 నాను నిఙితి సొహి వెన్కా, మీరు ఇనికబా నెస్తెఙ్నఙి వెన్బాఇదెర్. ఎందానిఙ్ ఇహిఙ, దేవుణు ఆత్మ మిఙి నెస్పిస్నాన్. నా ఇస్టమ్దిఙ్ కూడిఃతి మన్నికెఙ్ఇన్నికబా మీరు బుబ్బెఙ్ లొస్తిఙ, వాండ్రు అయాక సీనాన్, ఇజి నాను నిజం మీ వెట వెహ్సిన.
24 ఏలుదాక నా ఇస్టమ్దిఙ్ కూడిఃతి మన్నికెఙ్ ఇన్నికబా లొస్ఇతిదెర్. మీ సర్ద పూర్తి ఆని వందిఙ్లొస్తు. మిఙి దొహ్క్నాద్.
25 నాను మిఙి కతవజ యా సఙతిఙ్నెస్పిస్త మన. గాని కతవజ నెస్పిస్ఏండ, బుబ్బ వందిఙ్ మిఙి టెట అర్దం ఆనిలెకెండ్ వెహ్ని కాలం వాజినాద్.
26 అయా కాలమ్దు, నా ఇస్టమ్దిఙ్ కూడిఃతి మన్నికెఙ్ మీరు లొస్నిదెర్. మీరు లొస్తికెఙ్ వరిఙ్ సిఅ ఇజి బుబ్బెఙ్ వెహ్న ఇజి నాను వెహ్ఏ.
27 ఎందానిఙ్ ఇహిఙ, బుబ్బనె మిఙి నండొ ప్రేమిస్నాన్. మీరు నఙి ప్రేమిస్నిదెర్. నాను బుబ్బ బాణిఙ్వాత ఇజి మీరు నమిజినిదెర్. అందెఙె వాండ్రు మిఙి నండొ ప్రేమిస్నాన్.
28 నాను బుబ్బ బాణిఙె యా లోకమ్దు వాత. ఏలు నాను యా లోకం డిఃసి మర్జి బుబ్బ డగ్రు సొన్సిన”.
29 నస్తివలె వన్ని సిసూర్, “ఇదిలో, వానివలె నీను కత లెకెండ్ ఆఏండ, అర్దం ఆని లెకెండ్ వెహ్సిని.
30 నీను విజు నెస్నికి ఇజి ఏలు మాపు నెసినాప్. ఎయెర్బా నిఙి వెన్బాఎండ ముఙాలె, వారు ఒడ్ఃబిజినికెఙ్ నీను నెసిని ఇజి మాపు నెసినాప్. అందెఙె నీను దేవుణు బణిఙ్వాతికి ఇజి మాపు నమ్మిజినాప్”, ఇజి వెహ్తార్.
31 అందెఙె యేసు, “మీరు ఏలు నమిజినిదెరా?
32 ఇదిలో, మీరు మీ ఇల్కాఙ్సెద్రిజి సొని కాలం వాజినాద్. అయాక ఏలె వాత మనాద్. మీరు నఙి డిఃసి సొనిదెర్లె. నాను ఒరెనె ఆన. గాని నాను ఒరెనె ఆఎ. నా బుబ్బ నావెట మనాన్.
33 మీరు నా వెట కూడిఃతి మన్నిదెర్. అందెఙె మీరు సమాదనం దాన్ మండ్రెఙ్ నాను యా సఙతిఙ్ మిఙి వెహ్త మన. యా లోకమ్దు మిఙి కస్టమ్కు బాదెఙ్మనె. గాని దయ్రమ్దాన్ మండ్రు. నాను యా లోకమ్దు మన్ని దేవుణుదిఙ్ దూసిస్నివరిఙ్ గెలస్త మన్న.