3
నాలికదిఙ్ అడ్డు కిదెఙ్
1 నాను ప్రేమిసిని తంబెరిఙండె, మీ లొఇ నండొండార్ బోద వెహ్నికిదెర్ ఆమాట్. ఎందానిఙ్ ఇహిఙ, బోదిసినికార్ ఆతి మిఙి దేవుణు గటిఙ్ ఆతి తీర్పు సీనాన్ ఇజి మీరు నెసినిదెర్.
2 మాటు విజేటె నండొ పణిలొఇ తప్సి సొన్సినాట్. గాని ఎయెన్‌బా వాండ్రు వెహ్ని మాటెఙ లొఇ ఎసెఙ్‌బా తప్‌ఏండాతిఙ వాండ్రు పూర్తి ఆతికాన్, ఇని తపు సిలికాన్. వాండ్రు వన్ని ఒడొఃల్ మన్సు విజు అణసె ఆజి మండ్రెఙ్ అట్నాన్.
3 గుర్రమ్‌ది వెయ్‌దు కలెం ఇట్తిఙ అక్క లొఙిజినాద్. అయ ఇజిరి కలెమ్‌దానె మఙి ఇస్టమాతి బాడ్డిదు దన్నిఙ్ మహ్తెఙ్ ఆనాద్.
4 సిల్లిఙ ఉండ్రి ఓడఃదిఙ్ సుడ్ఃదు. అక్క ఎసొ పెరిక ఆతిఙ్‌బా, పెరి గాలిదాన్ సొనికెఙ్ ఆతిఙ్‌బా, ఓడఃదు మన్ని సుకాని ఇని ఇజిరి మరదాన్ ఓడః నడిఃపిసినికాన్, వన్నిఙ్ ఇస్టమాతి బాడ్డిదు ఒసినాన్.
5 అయాలెకెండ్ నాలికబా ఇజిరిక ఆతిఙ్‌బా అక్క గొప్ప వనక వందిఙ్ పొఙిజి వర్‌గిజినాద్ ఎస్సొ ఇజిరి సిసు ఆతిఙ్‌బా పెరి గొరొన్‌ది మరెకాఙ్ విజు సుర్నపొక్నాద్.
6 నాలికబా ఉండ్రి సిసు లెకెండె. ఒడొఃల్‌దు మన్ని వనకలొఇ అక్క పూర్తి సెఇక. అక్క ఒరెన్ వన్నిఙ్ పూర్తి సెఎణ్ కిజినాద్. నరకమ్‌దానె వాతి సిసు నాలికాదు కసి వన్ని బత్కు విజు నాసనం కిజినాద్.
7 విజు రకమ్‌కాణి జంతుఙ, ఆగసమ్‌దు మన్ని పొటిఙ, సరాస్‍కాఙ్, ఏరు లొఇ మన్ని విజు మొయెఙ, లొఙిస్తెఙ్ లోకు అట్నాన్.
8 గాని ఎయెర్‌బా నాలికదిఙ్ లొఙిస్తెఙ్ అట్‌ఏర్. అది పూర్తి సెఇక. దనిఙ్ అడ్డు కిదెఙ్ ఎయెర్ అట్‌ఏర్. సావుదిఙ్ తగితి విసం తసినాద్.
9 యా నాలికదానె బుబ్బాతి దేవుణుదిఙ్ స్తుతి కిజినాట్. యా నాలికదానె దేవుణు మూర్తి లెకెండ్ పుటిస్తి లోకాఙ్ సయిప్ సీజినాట్.
10 ఉండ్రె వెయుదానె నెగ్గి మాటఙ్, సయిప్ సీని మాటెఙ్ వాజినాద్. నా తంబెరిఙాండె, మీరు ఆహె మంజినిక ఆఏద్.
11 ఉండ్రె ఊటదానె నెగ్గి ఏరుని సెఇ ఏరు రెఉ.
12 బొడె మరాతు ఒలివ పట్కు అస్‌ఉ. ద్రాక్స తివాద్ బొడె పట్కు రెఉ. అయావజనె సోరు ఏరు సోని ఊటదాన్ నెగ్గి ఏరు రెఉ.
రుండి రకమ్‌కాణి గెణమ్‌కు
13 మీ లొఇ గెణం తెలివి మన్నికాన్ మహిఙ, అక్క వన్ని నెగ్గి బత్కుదాన్ రుజుప్ కిదెఙ్. గెణమ్‌దాన్, లొఙిజి మంజిని గుణం వానాద్. నఙి గెణం తెలివి మనాద్ ఇజి లొఙిజి మంజిని గుణమ్‌దాన్ వాండ్రు కిని పణి లొఇ తోరిసిన్.
14 గాని మీ మన్సుదు నండొ పగ, గోస, మీ వందిఙ్ మన్ని మన్సు ఇడ్ఃతిఙ మీ గెణం వందిఙ్ పొఙిదెఙ్ ఆఏద్. మీ గెణం వందిఙ్ వెహ్నిక నిజం ఆఏద్.
15 నన్ని బుద్ది దేవుణు సిత్తిక ఆఏద్. అక యా లోకమ్‌దాన్, లోకు బుద్దిదాన్, సయ్‌తానుబాణిఙ్ వాతి గెణమె.
16 ఎంబె గోస, మీ వందిఙె మని మన్సు మనాదొ, అబ్బె టంటెఙ్, విజు రకమ్‌కాణి పాపమ్‌కు మంజినె.
17 గాని దేవుణుబాణిఙ్ వాని గెణం కల్తి సిల్లిక. అయ గెణం మన్నికార్ సమదనమ్‌దాన్, సార్లిదాన్, విజేరెవెట కూడ్ఃజి, లొఙిజి మంజిని బుద్దిదాన్, కనికారమ్‌దాన్, నెగ్గి పణిఙాణ్, విజేరిఙ్ ఉండ్రెలెకెండ్ సుడ్ఃజి, నిజమ్‌దాన్ పణి కినార్.
18 నమదనం కినికార్ సమదనం విత్సి, నీతి నిజయ్తి ఇని పంట కొయ్‌నార్.